హైదరాబాద్ : నల్లగొండ(Nallagonda) జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో( Road accident)పలువురు గాయపడ్డారు. ఏపీలోని తిరువూరుకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టడంతో పలువురు స్పల్పంగా గాయపడ్డారు. ముందు వెళ్తున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
కాగా, తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చకున్నారు. మరో వైపు సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ప్రజలు ఏపీకి తరలి వెళ్తుండటంతో పంతంగి టోల్ ప్లాజా వాహనాల రద్దీ నెలకొంది. విజయవాడ రూట్లో వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.