విద్యుత్ షాక్‌తో రెండు బర్రెలు, దూడ మృతి
కష్టపడి పెంచుకున్న బర్రెలు కళ్లముందే విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందడంతో ఓ రైతు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కట్టంగూర్ మండలంలోని గార్లబాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తేలువారిగూడెం గ్రామానికి చెందిన రైతు తేలు రవి జీవనాధారంగా భావించిన..
కట్టంగూర్, జూన్ 12 : కష్టపడి పెంచుకున్న బర్రెలు కళ్లముందే విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందడంతో ఓ రైతు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కట్టంగూర్ మండలంలోని గార్లబాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తేలువారిగూడెం గ్రామానికి చెందిన రైతు తేలు రవి జీవనాధారంగా భావించిన రెండు బర్రెలు, ఒక దూడ శుక్రవారం విద్యుత్ తీగల కారణంగా ప్రాణాలు కోల్పోయాయి. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం, గాలివానకు గ్రామ శివారులోని ఓ విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో విద్యుత్ తీగలు నేలపై పడ్డాయి. అయితే వాటిని అధికారులు గుర్తించి తొలగించకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం రైతు రవి తన బర్రెలను మేపేందుకు వ్యవసాయ పొలాల వైపు తీసుకెళ్తుండగా, పచ్చిక కోసం ముందుకు వెళ్లిన గేదెలు నేలపై పడి ఉన్న విద్యుత్ తీగలను తాకాయి. ఒక్కసారిగా విద్యుత్ ప్రవాహానికి గురైన రెండు బర్రెలు, ఒక దూడ అక్కడికక్కడే మృతి చెందాయి. కళ్లముందే మూగ జీవాలు ప్రాణాలు కోల్పోవడం చూసి రైతు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతిచెందిన పశువుల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

