– నమస్తే తెలంగాణ కథనానికి స్పందించిన అధికారులు
– హర్షం వ్యక్తం చేస్తున్న తుంగతుర్తి ప్రజలు, వాహనదారులు
తుంగతుర్తి, జనవరి 21 : తుంగతుర్తి మెయిన్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రం నుండి మద్దిరాలకు వెళ్లే ప్రధాన రహదారి మహాత్మాగాంధీ విగ్రహం నుండి జూనియర్ సివిల్ కోర్టు వరకు సీసీ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని ఈ నెల 12న నమస్తే తెలంగాణ దినపత్రికలో ” తుంగతుర్తి మెయిన్ రోడ్డుకు మోక్షం ఎప్పుడో ” అనే శీర్షికన ప్రచురమైన వార్తకు జిల్లా అధికారులు స్పందించారు. బుధవారం రోడ్డు పనులను ప్రారంభించారు. దీంతో తుంగతుర్తి ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.