తుంగతుర్తి, మార్చి 12 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో బుధవారం డిసిసిబి డైరెక్టర్, సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అధ్యక్షతన పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మూడు మాసాలుగా జనవరి నుండి మార్చి 11 వరకు నిర్వహించిన లావాదేవీలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
రైతు సేవా సహకార సంఘం మహా జనసభను ఈ నెల 29న నిర్వహించాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. తుంగతుర్తి సొసైటీలో 844 బస్తాల యూరియా అందుబాటులో ఉన్నందని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి వందనపు వెంకటేశ్వర్లు, సొసైటీ డైరెక్టర్లు మోడెం శ్రీలత, యాదగిరి, రామచంద్రు, మల్లయ్య,మజీదు, భిక్షంరెడ్డి, రామనరసమ్మ, ఈదయ్య, యాకయ్య, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.