పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలు ప్రగతి పథంలో నడుస్తు న్నాయని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకమైనవేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పలువురు ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం సూర్యాపేటలోని క్యాంపు కార్యాల యంలో మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రంలో అక్కున చేర్చుకొని అద్భుతమైన పాలన అందిస్తున్నా రన్నారు. నిరంతర అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అందుకే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఇతర రాష్ర్టాల నాయకులు, ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
సూర్యాపేట టౌన్, ఆగస్టు 2 : పోరాడి సాధించుకున్న తెలంగాణలో తొమ్మిదేండ్లుగా సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకాలేనని.. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేస్తూ ఉద్యోగులు జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డిని బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని రంగాల అభివృద్ధితో పాటు అందరి సమస్యలను పరిష్కరిస్తూ అక్కున చేర్చుకుంటున్నామని తెలిపారు. ఉద్యమ సమయంలోనే అం దరి కష్టాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆ దిశగా నిరంతర అభివృద్ధి పాలన సాగిస్తున్నారని కొనియాడారు.
సమైక్య పాలనలో అన్ని విధాలుగా ఆగమైన తెలంగాణ స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. నిరంతర అభివృద్ధి పాలనతో ప్రస్తుత రాష్ట్ర అభివృద్ధి యావ త్ దేశానికే ఆదర్శంగా నిలించిందని, అందుకే ఆయన నాయకత్వాన్ని అన్ని రాష్ర్టాలు కోరుకుంటున్నాయని తెలిపారు. నిస్వార్థ పాలన.. నిరంతర అభివృద్ధే సీఎం కేసీఆర్ తమకు నేర్పించాడని.. అటువంటి గొప్ప నాయకున్ని మించిన నాయకుడు యావత్ దేశంలోనే లేడన్నారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా రాష్టంలో 24గంటల విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. నిరంతర విద్యుత్‌తో పాటు తాగు, సాగు నీరు అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో అభివృద్ధి కనిపిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరి భాగస్వామ్యంతో ఎంతో ప్రగతి సాధించిందని తెలిపారు.
రాష్ట్రంలో ఆకలిని పారదోలి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలన దార్శనికతకు పెట్టిం ది పేరన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు ఎన్నో చూశామని.. పోరాడి సాధించిన తెలంగాణలో వాటిని పూర్తిగా రూపుమాపామన్నారు. తెలంగాణ రాష్ట్రమేర్పడితే ఏదైతే సాధించుకుంటామని కలలు కన్నామో ప్రస్తుతం అవి సాకారం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం సురేందర్, అసిస్టెంట్ మేనేజర్ నాగశ్రీ, ఉద్యోగులు నర్సయ్య, ఏకాంబ్రం, సుధాకర్, బీవీ.రా వు, రాంబాబు, శ్రీనివాస్, సావిత్రి పాల్గొన్నారు.