కట్టంగూర్, నవంబర్ 26 : టీఎస్ యూటీఎఫ్ కట్టంగూర్ మండల నూతన కమిటీని బుధవారం కట్టంగూర్‌లో జరిగిన మహాసభలో రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పుట్ట రాములు, ప్రధాన కార్యదర్శిగా దేశపాక కృష్ణ, ఉపాధ్యక్షులుగా కనకదుర్గ, పోషం సైదులు, కోశాధికారిగా కొండ్ర నాగలక్ష్మి, మండల మహిళ కమిటీ కన్వీనర్ సౌజన్య, ఎఫ్‌డబ్ల్యూఎఫ్ కన్వీనర్‌గా కక్కిరేణి శ్రీనివాసులు, మండల కార్యదర్శులుగా మీనయ్య, మాణిక్యం, నాగేశ్వర్రావు, శైలజ, జగదీష్, సౌజన్యతో పాటు జిల్లా మహా ప్రతినిధులుగా బద్రీనారాయణ, వెంకటరమణ, రాజశేఖర్ రెడ్డి, అంజనేయులు, నామా వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు.