భువనగిరి అర్బన్, మే 24 : పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్- 2024 ప్రవేశ పరీక్ష శుక్రవారం సజావుగా జరిగింది.
భువనగిరిలో 5 కేంద్రాలు, యాదగిరిగుట్టలో 2 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరిగింది. 1,496 మంది విద్యార్థులకు 1,373(బాలురు 754, బాలికలు 619) మంది హాజరైనట్లు పాలీసెట్ జిల్లా కో-ఆర్డినేటర్ షఫీజ్ అక్తర్ తెలిపారు.