చౌటుప్పల్, అక్టోబర్ 26 మునుగోడు గడ్డపై టీఆర్ఎస్ గెలువడం, గులాబీ జెండా ఎగురడం ఖాయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించడం తథ్యమని తేల్చిచెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్‌రెడ్డితో కలిసి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నాయన్నారు.
కుల మత వర్గ భేదాలు లేకుండా అందరికీ సమానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మునుగోడు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని సూచించారు. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్వలాభం కోసం రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డికి ఈ ఎన్నికల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ కుట్రలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని సూచించారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, లేతాకుల రఘుపతిరెడ్డి, సుడుగు మహేందర్‌రెడ్డి, కాసం మహిపాల్‌రెడ్డి , మేకల ముత్యంరెడ్డి, పల్లె నర్సింగరావు, డాక్టర్ బీవీ చారి, వేముల సంతోష్‌రెడ్డి, బాలరాజు, సంజయ్‌బాబు, వెంకటేశ్ యాదవ్, శ్రీశైలం, నవీన్, ప్రవీణ్, సత్తయ్యగౌడ్, శేఖర్, రామానుజం, మల్లయ్యగౌడ్ పాల్గొన్నారు.