సంఘం యూనియన్ అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి
యాదగిరిగుట్ట రూరల్, జూలై 18 : టీఆర్ఎస్కేవీతోనే కార్మికులకు న్యాయం జరుగుతుందని ప్రీమియర్ పరిశ్రమ సంఘం యూనియన్ అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. పెద్దకందుకూరు ప్రీమియర్ పరిశ్రమకు చెందిన టీఆర్ఎస్కేవీ నూతన కార్యవర్గన్ని మండలంలోని వంగపల్లి గ్రామంలో సోమవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కంపెనీలో పనిచేసిన కార్మికులకు కంపెనీ నుంచి ఎలాంటి మెడికల్ ఇన్సూరెన్సులు లేవన్నారు. కార్మికులు పదో అగ్రిమెంట్లో టీఆర్ఎస్కేవీకి మద్దతు పలికాక ఒక్కో కార్మికుడికి రూ.2లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ చేయించినట్లు తెలిపారు. గతంలో ఉన్న వారు కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై ప్రొడక్షన్ టార్గెట్లు పెంచి కార్మికులపై ఒత్తిడి తెచ్చారని, దీంతో కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. గతంలో అగ్రిమెంట్లో ఉన్న యూనియన్లు తమ స్వప్రయోజనాలు చూసుకుంటూ కార్మికుల హక్కులకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. టీఆర్ఎస్కేవీ అగ్రిమెంట్‌కు వచ్చాక అనేక రకాలుగా ఇబ్బందులెదురైనా వాటన్నింటిని ఎదుర్కొని కార్మికుల హక్కులు సాధించామని తెలిపారు. కంపెనీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో బెనిఫిట్లు అందించిన ఘనత టీఆర్ఎస్కేవీదేనని పేర్కొన్నారు. ప్రస్తుత 11వ అగ్రిమెంట్ సైతం కార్మికులందరికీ లాభం చేకూర్చేలా చేస్తున్నట్లు తెలిపారు. దీని గురించి కంపెనీ యాజమాన్యంతో చర్చిస్తున్నామన్నారు. ముమ్మాటికి పరిశ్రమలోని కార్మికులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేకూరేలా ఈ అగ్రిమెంట్ చేయిస్తామన్నారు. అనంతరం సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
టీఆర్ఎస్కేవీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గవ్వల రమేశ్, జనరల్ సెక్రటరీగా పి.ఆదాం, ట్రెజరర్‌గా గుజ్జ బాలరాజు, గౌరవ వైస్ ప్రెసిడెంట్లుగా బరిగె నర్సింహులు, ఎలక్షన్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లుగా ఎస్.చంద్రయ్య, శంకర్, అఫ్జల్, వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా శ్రీశైలం, వీఆర్సీ.రెడ్డి, బాలరాజు, సాగర్, కర్ణాకర్, మహిళ సెక్రటరీలుగా కవిత, శోభారాణి, మల్లమ్మ, సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా నర్సింహులు, రమేశ్, శ్రీనివాస్, శ్రీనుతో పాటు మరికొంత మంది, జాయింట్ సెక్రటరీలుగా పాపయ్య, బీరుమల్లయ్య, సత్యనారాయణ, లక్ష్మీనర్సయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా యాదగిరి, శంకరయ్య, స్వామితో పాటు మరికొందరిని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన వారు ఎల్లప్పుడూ కార్మికులకు అండగా నిలబడాలని గొంగిడి మహేందర్‌రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, పెద్దకందుకురు ఉపసర్పంచ్ మచ్చ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.