రామగిరి/బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 6 : తొలి పూజలందుకునే వినాయకుడి పండుగ వచ్చేసింది. నవరాత్రోత్సవాల సంబురాలు తెచ్చింది. నేడు వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి లంబోధరుడి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. మార్కెట్లలో గణేశ్ విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగాయి. పూజకు కావాల్సిన పూలు, పండ్లు ఇతర సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడాయి.
పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి గణపతి విగ్రహాలకే జనం మొగ్గు చూపుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశాయి. నేటి నుంచి ప్రత్యేక పూజలు, భక్తిపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాలు కోలాహలంగా మారనున్నాయి. జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి వెలుగులు నిండాలని, ప్రకృతి కరుణించి, మహా గణపతి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
Nalgonda6