భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వేడుకల్లో భాగస్వాములయ్యేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య నేతలంతా ఢిల్లీకి బాట పట్టారు. బుధవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో
పాల్గొననున్నారు. అందుకోసం మంగళవారం రాత్రికే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, మూడు జిల్లాల అధ్యక్షులు, ఇతర ముఖ్యులంతా దేశ రాజధానికి చేరుకున్నారు. మరికొందరు బుధవారం తెల్లవారు జామున బయల్దేరనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో కలిసి వీరంతా బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభ ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్13(నమస్తే తెలంగాణ) : ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రెండ్రోజుల కిందే ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం 12.47 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ముందుగా జెండావిష్కరణ చేసి, కార్యాలయాన్ని ప్రారంభించి, కేసీఆర్ తన చాంబర్లో ఆసీనులు కానున్నారు. బీఆర్ఎస్ కేంద్ర
కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రజాప్రతినిధులను, ముఖ్య నేతలందరినీ పార్టీ అధినేత
కేసీఆర్ ఢిల్లీకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు హస్తినకు చేరుకున్నారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలంతా మంగళవారం సాయంత్రమే తరలివెళ్లారు. ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల
హస్తినకు మన నేతలు(మొదటి పేజీ తరువాయి)
భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి చేరుకోగా, బొల్లం మల్లయ్యయాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్ బుధవారం తెల్లవారుజామున బయల్దేరనున్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు.
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్లు బండ నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, ట్రైకార్ చైర్మన్ రామచందర్‌నాయక్, డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ సోమ భరత్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, పార్టీ నేతలు ఒంటెద్దు నర్సింహారెడ్డి, గుజ్జ యుగేంధర్‌రావు, జిల్లా శంకర్ తదితరులు కూడా ఢిల్లీకి తరలివెళ్లారు. కార్యాలయ ప్రారంభోత్సవ సమయానికి చేరుకునేందుకు మరికొందరు సిద్ధ్దమయ్యారు.