Mirai | జపాన్లోకి అడుగుపెడుతున్న తేజ సజ్జ మిరాయ్.. రిలీజ్ ఎప్పుడు అంటే..!
Mirai | యువ హీరో తేజ సజ్జ నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం మిరాయ్ మరో మైలురాయిని అందుకోబోతోంది. భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఆగస్టు 21, 2026న జపాన్‌లో "Mirai: Warrior of Destiny" పేరుతో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Mirai | యువ హీరో తేజ సజ్జ నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం మిరాయ్ మరో మైలురాయిని అందుకోబోతోంది. భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఆగస్టు 21, 2026న జపాన్‌లో “Mirai: Warrior of Destiny” పేరుతో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తేజ సజ్జ వరుస విజయాలతో మంచి ఫామ్‌లో కొనసాగుతున్నారు. హనుమాన్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత ‘మిరాయ్’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మరో అడుగు వేస్తున్నారు.
ముఖ్యంగా ‘మిరాయ్’లోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX), ఫాంటసీ ప్రపంచం, యాక్షన్ ఎపిసోడ్లు, భావోద్వేగాలతో కూడిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదే అంశాలు జపాన్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాయో చూడాలని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ అంశాలను ఆధునిక విజువల్ టెక్నాలజీతో మేళవిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ‘మిరాయ్’లో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటించగా, మంచు మనోజ్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే జగపతి బాబు, శ్రియా శరణ్, జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మించారు. ఇటీవలి కాలంలో భారతీయ సినిమాలకు జపాన్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ‘మిరాయ్’ విడుదల కూడా అక్కడి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన అందుకుంటుందనే ఆసక్తి నెలకొంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్దపీట వేసే జపాన్ మార్కెట్లో ఈ చిత్రం విజయవంతమైతే, తేజ సజ్జ కెరీర్‌కు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
హరీశ్‌రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

