FIFA World cup: ఆస్ట్రియాపై 3-0 గోల్స్ తేడాతో స్పెయిన్ విక్టరీ
FIFA World cup: రౌండ్32లో స్పెయిన్ ఈజీ వియాన్ని నమోదు చేసింది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్లో 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి రౌండ్16లోకి వెళ్లింది. స్పెయిన్ ప్లేయర్ మైఖేల్ ఒయర్జబల్ రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
లాస్ ఏంజిల్స్: ఫిఫా వరల్డ్కప్(FIFA World cup)లో 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ నాకౌట్ మ్యాచ్ నెగ్గింది. లాస్ ఏంజిల్స్ స్టేడియంలో ఆస్ట్రియాతో జరిగిన రౌండ్32 మ్యాచ్లో 3-0 గోల్స్ తేడాతో స్పెయిన్ విజయాన్ని నమోదు చేసింది. స్పెయిన్ జట్టులో మైఖేల్ ఒయర్జబల్, పెడ్రో పోర్రోస్ గోల్స్ చేశాడు. ఒయర్జబల్ రెండో గోల్స్ చేసి స్పెయిన్ జట్టుకు ఈజీ విక్టరీని అందించాడు. ఈ టోర్నమెంట్లో అతని ఖాతాలోకి నాలుగు గోల్స్ వెళ్లాయి. ఇక వచ్చే సోమవారం డల్లాస్లో బలమైన పోర్చుగల్తో స్పెయిన్ తలపడనున్నది. తొలి అర్థభాగం చివరలో ఒయర్జబల్ స్పెయిన్కు ఫస్ట్ గోల్ అందించాడు. 36వ నిమిషంలో అతను గోల్ కొట్టాడు. రెండో అర్థభాగం 66వ నిమిషంలో పెడ్రో పోర్రో గోల్ చేయడంతో స్పెయిన్ లీడింగ్ కొనసాగించింది. ఏ దశలోనూ ఆస్ట్రియా తన సత్తాను చాటలేకపోయింది. ఆట 89వ నిమిషంలో ఒయర్జబల్ రెండోసారి గోల్ చేసి స్పెయిన్కు భారీ విక్టరీని అందించాడు. 1954 తర్వాత తొలిసారి ఆస్ట్రియా నాకౌట్ మ్యాచ్ ఆడింది. కానీ దారుణ ఓటమితో టోర్నీ నుంచి ఔటైంది.
🇪🇸 Next stop: Round of 16! #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) July 2, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

