– మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్
దేవరకొండ, ఫిబ్రవరి 06 : దేవరకొండ పట్టణాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అభివృద్ధి కొనసాగింపునకు మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నాయక్ ప్రజలను కోరారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని 2, 3వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్, కేతావత్ బిల్యా నాయక్ మాట్లాడుతూ.. దేవరకొండ పట్టణం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్, దేవరకొండ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, సినియర్ నాయకులు గాజుల ఆంజనేయులు, నీల రవికుమార్, ఆయా వార్డు అభ్యర్థులు, గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.

‘దేవరకొండ అభివృద్ధికి బీఆర్ఎస్ను గెలిపించాలి’