సూర్యాపేట టౌన్, మే 26 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం కీలక పాత్ర పోషించిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఈ నెల 31న హైదరాబాద్‌లో జరగనున్న టీజేఎఫ్ రజతోత్సవ సభ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
జర్నలిస్టులంతా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిర్భయంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణాపై పక్క రాష్ర్టాలు చేస్తున్న కుట్రలను ఎండగట్టాలని కోరారు. టీజేఎఫ్ రజతోత్సవ సభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మారిపెద్ది శ్రీనివాస్, జర్నలిస్టులు వజ్జె వీరయ్య, పి.సైదిరెడ్డి, చల్లా చంద్రశేఖర్, ఫణీంద్ర, సురేష్, గోవర్ధన్, శ్యాంసుందర్‌రెడ్డి, అమరగాని నాగేందర్, సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.