పాలకవీడు, నవంబర్ 13 : పాలకవీడు మండలం పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద శూన్యంపహాడ్ రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ను టిప్పర్ లారీ ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని మహంకాళిగూడెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.