కట్టంగూర్, సెప్టెంబర్ 22 : దసరా పండుగ సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు విలువైన ఆభరణాలు, సామగ్రి, నగదు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లలో పెట్టకూడదని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటి తాళాలను బయట నుంచి కాకుండా లోపలి నుంచి వేసుకోవాలన్నారు. బీరువా, ఇతర తాళాలు, విలువైన వస్తువులను ఇంట్లో పెట్టుకోకుండా వెంట తీసుకెళ్లాలన్నారు. బంగారు, వెండి ఆభరణాలను బ్యాంక్‌ల్లో భద్రపరుకోవాలన్నారు.
ఊరెళ్లేటప్పుడు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు 100కు డయల్ చేయాలన్నారు. ముఖ్యంగా శివారు కాలనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో పెంట్రోలింగ్తో పాటు రాత్రి సమయాల్లో తనిఖీ చేపడుతామని పేర్కొన్నారు.