సూర్యాపేట, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం మొదలుకొని మం త్రులు.. ఇతర పాలకులు డబ్బు యా వతోనే పని చేస్తున్నారు. పాలనపై కనీస పరిజ్ఞానం లేక అ న్ని రంగాలను సత్యనాష్ చేస్తున్నారు’ అని మా జీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అ న్నారు. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కష్టాలన్నీ ఒక్కొక్కటిగా ఈ రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చూపిస్తోందని మండిపడ్డారు.
శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘హాస్టళ్లలో భోజనం సరిగా లేదని పిల్లలే ధర్నాలు చేస్తున్నరు. మెస్ చా ర్జీలు సరిగా రావ డం లేదు. చిన్న వ్యాపారుల వద్ద అ ప్పులు చేసి హాస్టళ్లు నడుపుతున్నరు. కిరాణాకొట్టు, కూరగాయ వ్యాపారుల దయాదక్షిణ్యాలతో హాస్టళ్లు నడిచే దుస్థితి నెలకొంది. వెల్ఫేర్ ఆఫీసర్లు వాళ్ల జీతంతో హాస్టల్ నడుపుతున్నరు. విద్యాశాఖను దగ్గర పెట్టుకొని పిల్లల జీవితాలతో సీఎం ఆటలాడుతున్నరు.
పంచాయతీలను కార్యదర్శులు అప్పులు చేసి నడుపుతున్నరు. మొత్తం మీద రేవంత్‌కు ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదు’ అని మండిపడ్డారు. వైద్యం మరీ దారుణంగా తయారైందన్నారు. సూర్యాపేట ఆసుపత్రి దేశవ్యాప్తంగా పేరుగాంచిందని గుర్తు చేస్తూ కరోనా కాలంలో ఎనలేని సేవలు అందించిందని, నేడు ఆ ఆసుపత్రికి పోవాలంటే భయపడే దుస్థితిని తెచ్చిండ్రన్నారు. రాజకీయాలకతీతంగా పని చేయాల్సిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లా ఎస్పీలు రైతులు, ప్రజలపై ఉదాసీనంగా ఉండాలన్నారు. పోలీసుస్టేషన్లను కాంగ్రెస్ నాయకులు నడుపుతున్నట్లుగా అనిపిస్తోందన్నారు. యూ రియా, మరే ఇతర సమస్యలపై నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమం వస్తుందని ఆయన హెచ్చరించారు.
సముద్రంలో కలిసే నీటిని వినియోగించలేని దద్దమ్మలు
‘ఎస్ఎల్బీసీలో సచ్చిన శవాలను బయటకు తీయడానికి ఇప్పటికీ దిక్కులేదు. దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు’అని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తరచూ ఎస్‌ఎల్‌బిసిని పూర్తి చేస్తామని నీళ్లను వాటర్‌లో కలిపే మంత్రి చెప్పడం సిగ్గుచేటని కోమటిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. వందల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంటే నల్లగొండ గడ్డపై ఎస్ఎల్బీసీ ఉదయ సముద్రం ఎండుతోందన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు దద్దమ్మలని ఎద్దేవా చేశారు. ‘నీళ్లల్ల వాటర్ కలుపుతావో.. వాటర్ల నీళ్లు కలుపుతావో నీ ఇష్టం. ఉదయ సముద్రం నింపడమో లేక వాటిలో దూకడమో చేయాలని’ అని అన్నారు.