కొండమల్లేపల్లి, ఆగస్టు 22 : కొండమల్లేపల్లి మండలం కొర్రోని తండాలో ఈ నెల 18న జరిగిన చోరీ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. శుక్రవారం సీఐ నవీన్ కేసు వివరాలను వెల్లడించారు. కొర్రోని తండాలో కొర్రపట్టి భర్త గంజా ఇంట్లో ఈ నెల 18న రాత్రి సమయంలో ఓ వ్యక్తి దూరి ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోని కేజీ వెండి, రూ.1.50 లక్షల నగదును అపహరించుకుపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కేతావత్ బద్య (52) S/o దేవుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి నేడు ఉదయం పట్టుకున్నట్లు తెలిపారు. నేరం అంగీకరించడంతో బద్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కేసును చాకచక్యంగా చేధించిన సీఐ నవీన్‌కుమార్, ఎస్ఐ అజ్మీర రమేశ్, క్రైమ్ సిబ్బంది హేమ నాయక్, భాస్కర్‌ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.