సూర్యాపేట టౌన్, జూలై 9: నేర నియంత్రణలో ముందస్తు ప్రణాళికతో పని చేయాలని, కేసుల దర్యాప్తులో నైపుణ్యం చూపాలని మల్టీజోన్ 2 ఇన్చార్జి ఐజీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. జిల్లా ల సందర్శనలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ స్వా గతం పలికారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి సీఐలు, డీఎస్పీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా భౌగోళిక పరిస్థితులు, ఈ ఏడాది నమోదైన కేసుల తీరు తెన్ను లు, పోలీసుల ప్రణాళిక, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చేపట్టబోతున్న చర్యలు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమస్యాత్మక విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. చిన్న సమస్య కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యగా మారుతుందని ఇలాంటి వాటిని ఆదిలోనే పరిష్కరించాలన్నారు. ప్రజలకు, విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ జరుగకుండా విద్యాసంస్థల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని, పిల్లల అక్రమ రవాణా జరుగకుండా చూడాలన్నారు.
ఎస్పీ మాట్లాడుతూ స్థానిక సం స్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీరవీందర్రెడ్డి, ఏఆర్ ఎఎస్పీ జనార్ధన్‌రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరసింహచారి, ఏఓ మంజు భార్గవి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హరిబాబు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రంజిత్‌రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, వెంకటయ్య, నరసింహారావు, నాగేశ్వర్రావు, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, రజితారెడ్డి, ఐటీకోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్ ఉన్నారు.