నేరేడుచర్ల, జూలై 26: రాష్ట్రంలోని రైతులు యూరి యా విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని, కావాల్సినంత యూరియా అందుబాటులో ఉన్నద ని రాష్ట్ర మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నేరేడుచర్ల పీఏసీఎస్, ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం యూ నిట్‌గా తీసుకొని యావరేజిగా 9లక్షల మెట్రిక్ ట న్నుల యూరియా అవసరం ఉంటుందని అంచా నా వేశామని తెలిపారు.
ప్రస్తుత సీజన్లో 7లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని ప్రతిపాదనలు పంపగా, ఇప్పటికే 6లక్షల మెట్రిక్ టన్నులు రాష్ర్టానికి చేరిందన్నారు. మరో లక్ష మెట్రి క్ టన్నులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర అగ్రికల్చర్ కమిషనర్ పరిధిలో 1.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. రాష్ట్రంలోని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో 49,590, సొసైటీల్లో 36వేలు, మార్క్‌ఫెడ్‌లో 5,200, కంపెనీ గోదాంల్లో 2500 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని తెలిపారు.
ఒక్క జూలైలోనే 91వేల మెట్రిక్ టన్నులు సరఫరా జరిగిందన్నారు. సూర్యాపేట జిల్లాలోనే 9,800 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు వెల్లడించారు. ప్రైవేటు వ్యాపారుల నుంచి 2,800, సొసైటీల్లో 2,400, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 4,600 మెట్రిక్ టన్నులు ఉందని తెలిపారు. కేం ద్రం నుంచి వచ్చే యూరియాలో సగం ప్రైవేటు ఫర్టిలైజర్స్ దుకాణాలకు, మిగిలిన సగం సహకార సం ఘాలకు అందిస్తున్నామని అన్నారు. పకడ్బందీగా యూరియా పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ జ్యోతి, ఏడీఏ రవి, ఏవో జావేద్, క్లస్టర్ రిజిస్టర్ అధికారి కమల, పీఏసీఎస్ సీఈవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఎమ్మార్పీ ధరకే విక్రయించాలి
మిర్యాలగూడ(మాడ్గులపల్లి), జూలై 26: ఎరువుల దుకాణాదారులు రైతులకు యూరియాను ఎమ్మా ర్పీ ధరకే విక్రయించాలని స్టేట్ మార్క్‌ఫెడ్ మేనేజిం గ్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం మండ ల కేంద్రంలోని నాగార్జున డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మా ర్కెటింగ్ సొసైటీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను, స్టాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ యూరియాను ఎమ్మార్పీ ధర కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు తప్పవన్నా రు.
అవసరం మేరకు మాత్రమే యూరియాను వినియోగించాలని, వ్యవసాయేతర అవసరాలకు మ ళ్లించే దుకాణదారులు, ఇతరులపై చట్టపరమైన చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్, మార్క్‌ఫెడ్ డీఎం జ్యోతి, డీసీవో పత్యానాయక్, ఏ వో శివరాంకుమార్, డీలర్లు యాదగిరిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, కర్లపాటి శ్రీను, రైతులు పాల్గొన్నారు.