తెలంగాణ రాష్ట్రమే ధ్యాసగా, ధ్యేయంగా ఆవిర్భవించిన ఉద్యమ ప్టారీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా అవతరించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో
పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఎగురవేయడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగానూ సంబురాలు మిన్నంటాయి. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్.. జై భారత్ నినాదాలు మార్మోగాయి.
టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ పటాకులు కాల్చి పండుగ చేశాయి. స్వీట్లతో నోరు తీపి చేసుకున్నాయి. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నేత సీఎం కేసీఆర్.. దేశ భవిష్యత్‌కు దిక్సూచి అవుతారన్న విశ్వాసాన్ని మేధావి వర్గాలు వ్యక్తపరిచాయి. తిరుమలగిరి (సాగర్) వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల రాశుల మధ్య రైతులు సంబురాలు చేసుకున్నారు.తెలంగాణ భవన్లో
జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తోపాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు.
– నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ)
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేతల సంబురాలు
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పటాకులు కాల్చడంతో పాటు స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా జై బీఆర్ఎస్.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ఆశాభావం వ్యక్తంచేశారు. జాతీయ రాజకీయాలకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని కోరారు. అదేవిధంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ సుఖేందర్‌డ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
– నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, డిసెంబర్ 9