అర్వపల్లి, డిసెంబర్ 23 : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అర్వపల్లి సమీపంలోని హజ్రత్ ఖాజా నసీరొద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దర్గా ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం రాత్రి అర్వపల్లి పోలీస్‌స్టేషన్ నుంచి గంధం ఊరేగింపు వైభవంగా సాగింది.
కార్యక్రమానికి హాజరైన విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, డీఎస్పీ నాగభూషణం, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, వక్ఫ్ బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్ మహ్మద్ అలీ, సీఐ రాజేశ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మన్నె లక్ష్మీనర్సయ్యయాదవ్, ఎస్ఐ అంజిరెడ్డి, సర్పంచ్ బైరబోయిన సునీతారామలింగయ్య, ఖాదీం ఎండీ.మౌలానాలు గంధం ఎత్తుకుని ఊరేగించారు. దర్గా ప్రాంతంలో వెలిసిన దుకాణాలతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్, పార్టీ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్, చిల్లంచర్ల విద్యాసాగర్, ప్రభాకర్, అర్వపల్లి, యుగంధర్, గోసుల విజయ్ పాల్గొన్నారు.