మిషన్ భగీరథ @ 100 %
ఫ్లోరైడ్ తరిమికొట్టేందుకే ఇంటింటికీ తాగునీరు అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలులో భాగంగా మునుగోడు మండలంలోని అన్ని గ్రామాలకు పైపులైన్ పనులు పూర్తయ్యాయి.
- మునుగోడు మండలంలో పనులు పూర్తి
- హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
మునుగోడు రూరల్, జనవరి 9: ఫ్లోరైడ్ తరిమికొట్టేందుకే ఇంటింటికీ తాగునీరు అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలులో భాగంగా మునుగోడు మండలంలోని అన్ని గ్రామాలకు పైపులైన్ పనులు పూర్తయ్యాయి. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా ఉన్న మునుగోడులో మిషన్ భగీరథ పనులు 100 శాతం పనులు పూర్తి కావడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు మండలంలో 27 గ్రామ పంచాయతీలు 54 ఆవాసాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 200.8 కిలోమీటర్ల మేరా పైపులైన్ నిర్మాణం చేపట్టారు. మండలంలో మొత్తం 13,199 భగీరథ నీటి కనెక్షన్లు ఉండగా, మండల వ్యాప్తంగా 78 ట్యాంకుల ద్వారా సరఫరా జరుగుతున్నది. కొత్తగా నిర్మించిన 40 ట్యాంకులతో నీటిని సరఫరా చేయగా 38 ఇంటిగ్రేటెడ్ ట్యాంకుల ద్వారా సరఫరా
అవుతున్నది.
27 పంచాయతీకు నీళ్లు
మండలంలో మిషన్ భగీరథ పనులు 100 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే 27 గ్రామపంచాయతీల్లో ఇంటింటికీ భగీరథ నీళ్లు అందుతున్నాయి. ఏమైనా చిన్న, చిన్న రిపేర్లు వస్తే వెంటనే మరమ్మతులు చేయిస్తున్నాం.
-మణిదీప్, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, మునుగోడు
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
గతంలో తాగునీటికి నానా అవస్థలు పడేవాళ్లం. ప్రభు త్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీళ్లు అందించడం ఆనందంగా ఉంది. తాగునీటిని అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– బి.ధనమ్మ, చొల్లేడు గ్రామం
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

