నల్లగొండ రూరల్, జూలై 3: పదేండ్లుగా అధికారానికి దూరంగా ఉండడంతో అల్లాడిన కాం గ్రెస్ నేతలు ధనదాహం తీర్చుకోవటానికి గ్రా మాల్లో అక్రమ దారులు వెతుక్కుంటున్నారు. వాటిల్లో ప్రధానంగా ప్రభుత్వ భూము లు ఉన్న ప్రాంతాలను ఎంచుకొని వాటికి సమీపం లో ఉన్న భూములు కొనుగోలు చేసి వెంచర్ల నిర్మాణం చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చేపట్టే ఈ వెంచర్ల నిర్మాణాల్లో అడ్డుగా ఉన్న అధికారుల చేతుల తడిపి త తంగం ముగిస్తున్నారు.
మండలంలో ఈ ఏడాదిన్నర కాలంలో అనేక వెంచర్లు ఈ తరహాలోనే వెలిశాయి. ప్రధానంగా ఖాజీరామం లో వేసిన వెంచర్ సంబంధిత కాంట్రాక్టర్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. ఖాజీరామారంలోని సర్వే నెంబర్ 23,24,26లో దాసరి మల్ల య్య పేరు మీద ఉన్న భూమిని యాకూబ్ అనే వ్యక్తి కొనుగోలు చేయగా ఆయన నుంచి ఓ ప్రభుత్వ ఉద్యోగి రియల్టర్ అవతారమెత్తి తన కుమారుడైన పూర్ణచందర్ పేరు మీద మొత్తం రెండెకరా తొమ్మిది గుంటల జాగా కొనుగోలు చేశాడు. ఇంకేముంది అనుమతి తీసుకోకుండా నే అధికార పార్టీ నేతల జేబులు నింపి, స్థానిక అధికారుల చేతులు తడిపి అక్రమంగా వెంచర్ చేశారు.
30 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా..
సదరు వెంచర్‌కు ఆనుకొని రోడ్డు బిట్‌గా ఉన్న 2.26 ఎకరాల ప్రభుత్వ భూమి (సర్వే నెంబర్ 25)లో సుమారు 30 గుంటల జాగా సైతం ఆక్రమించి ఈ వెంచర్ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఖాజీ రామారం ‘నుడా’ పరిధిలో కి రావడంతో అక్కడ నుంచి లే అవుట్ పర్మిషన్ తీసుకొని నాలా కన్వర్ట్ చేయాల్సి ఉంది. ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ప్లాట్లు చేసి గుంటల లెక్క విక్రయించటంతో కొన్న వారికి సైతం పట్టాదారు పాసుపుస్తకాలు అందాయి. దీంతో వారు ప్లాటుగా కొన్న భూమిలో ఇల్లు కట్టుకున్నప్పటికీ వారికి సైతం రైతు భరోసా డబ్బులు పడటం గమనార్హం. ఇప్పటికే వెంచర్లో సగం మేరకు ప్లాట్ల విక్రయం పూర్తి కాగా కొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయి.
అధికార పార్టీ అండదండలతో..
గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ వెంచర్ ఏటీఎంలా మారిందని చెప్పవచ్చు. ‘నుడా’ నుంచి అనుమతి తీసుకోకుండానే రెండు గుంటల జాగా గ్రామ పంచాయతీకి ఇచ్చామని చెప్పి ప్రభుత్వ నిధులతో అక్కడి వరకు సీసీ రోడ్డు నిర్మా ణం చేపట్టారు. ఈ వెంచర్లో అధికార పార్టీ నేతలు ప్లా టు లెక్క కమీషన్ మాట్లాడుకొని ఒప్పందం కుదుర్చుకోగా…అధికారులు మాత్రం ఒకేసారి లక్షల్లో తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరగా ఖాజీరామారంలో లేఅవుట్ అప్రూవల్ కోసం ఎలాంటి దరఖాస్తు రాలేదని, ‘నుడా’ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్లాట్లు చేసి విక్రయిస్తే అది అక్రమమే అవుతుందని హెచ్చరించారు.
ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
గ్రామంలో ఈ మధ్య ఓ అక్రమ వెంచర్ వెలిసింది. ఈ వెంచర్‌కు ఎలాంటి అనుమతి లేకపోగా 30 గుంటల మేర ప్రభుత్వ భూమిని సైతం అక్రమించుకున్నారు. ఈ వెంచర్‌పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే అక్రమ వెంచర్ నిర్మాణ పనులు నిలిపివేసి, భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
-నారగోని సైదులు ,మాజీ వార్డు సభ్యులు, ఖాజీరామారం