బీబీనగర్, మార్చి 25: రాష్ట్రంలోని గొర్రెకాపరులు ఎదురొంటున్న సమస్యలను శాసనసభలో ప్రస్తావించి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర గొర్రెలకాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్, ఉపాధ్యక్షుడు గుండెబోయిన అయోధ్య యాదవ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది కుటుంబాలు గొర్రెల పెంపకమే ఆధారంగా జీవ నం కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం గొర్రెల కాపరులు అనేక సమస్యలు ఎదురొంటున్నారని పేరొన్నారు.
తమ సమస్యలను శాసనసభలో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రతి రెండు మండలాలకు ఒక గొర్రెల, మేకల మారెట్ యార్డు ఏర్పాటు చేయాలని, పశుసంవర్ధక శాఖలో సబ్ సెంటర్లు ఏర్పాటు చేసి, అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు. యాదవుల అభివృద్ధికి ప్రత్యేక యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. గొర్రెల కాపరులకు పెన్షన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దేశాబోయిన సూర్యనారాయణ యాదవ్, ఉపాధ్యక్షుడు జల్లి నర్సింహులు, ప్రధాన కార్యదర్శి సోము రమేశ్ కురుమ, దేశబోయిన నర్సింహ, కో మల్ల కుమార్, నకల చిరంజీవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.