ఎనిమిదేండ్లుగా గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, ప్రగతి పనులపై అన్ని ప్రాంతాల్లో చర్చ జరుగాలని, ఇందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వివరించేలా కార్యోన్ముఖులు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఆత్మకూర్.ఎస్ మండలం రామన్న గూడెం, పాతర్లపహాడ్, మిడ్తనపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 360 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్కు ఓటు వేసిన తర్వాతే ప్రజలందరి తలరాతలు మారాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో లబ్ధి పొందని ఇల్లుందా అని అన్నారు. బీఆర్ఎస్ తిరుగులేని పాలనతో విపక్షాల్లో వణుకు మొదలైందని, అందుకే ఆయా పార్టీల నాయకులు దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ కార్నర్ మీటింగ్‌లతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల్లో ఒకరు ముసలి సింహంలా పాకులాడే రాజకీయాలు చేస్తుంటే, మరొకరు పిల్ల కోతిలా గోకుడు రాజకీయం చేస్తూ నవ్వుల పాలవుతున్నారని అనారు.
– సూర్యాపేట టౌన్, మార్చి 5
సూర్యాపేట టౌన్, మార్చి 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసాదించిన సూర్యాపేట జిల్లాలో ఎనిమిదేండ్లుగా జరిగిన అభివృద్ధిపై చర్చ జరగాలని, బీఆర్ఎస్ శ్రేణులు సైతం ప్రజలకు వివరించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఆత్మకూర్ ఎస్ మండలంలోని రామన్నగూడెం, పాతర్లపహాడ్, మిడ్తనపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 360మంది మంత్రి సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎనిమిదేండ్లుగా అన్ని రంగాల అభివృద్ధితో పాటు వినూత్న రీతిలో అందిస్తున్న సంక్షేమ పథకాలతో యావత్ దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేసాకే ప్రజలందరి తలరాతలు మారాయని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో లబ్ధి పొందని ఒక్క ఇల్లయినా ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తిరుగులేని పాలనతో విపక్షాల్లో వణుకు మొదలైందని, అందుకే ఆయా పార్టీల నాయకులు దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ మూల మీటింగ్‌లతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులను గల్లీల్లో తిప్పుతూ అబాసు పాలవుతున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో తిరుగుతున్న కేంద్ర మంత్రులకు రైతులే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కమేడియన్లుగా కాంగ్రెస్ నాయకుల తీరు
కాంగ్రెస్ నాయకుల రాజకీయాలు కమేడియన్లను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఒకరు ముసలి సింహంలా పాకులాడే రాజకీయాలు చేస్తుంటే.. మరొకరు పిల్ల కోతిలా గోకుడు రాజకీయం చేస్తూ నవ్వుల పాలవుతున్నారని విమర్శించారు. రెండు పార్టీల్లో బడా నాయకులమని చెప్పుకుంటున్న వారు గతంలో చేసిన రౌడీ రాజకీయాలు, సిండికేట్ దందాలను ఇక్కడి ప్రజలెప్పటికీ మరిచిపోలేరన్నారు. నాడు ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా నీరు పారాల్సిన కాల్వలు ముళ్లకంపలతో దర్శనమిచ్చేవని పేర్కొన్నారు. నేడు తాగు, సాగుకు పుష్కలంగా నీరందుతూ వాగులు, చెరువులు అలుగులు పోస్తుంటే.. నిరంతర విద్యుత్, రైతు బంధు, రైతు బీమాతో వ్యవసాయం పడుగలా చేసుకుంటూ రైతులతో పాటు అన్ని రంగాల ప్రజలు ధీమాగా జీవిస్తున్నారన్నారు.
ఎనిమిదేండ్లుగా కనివినీ ఎరుగని అభివృద్ధితో ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ఐక్యతతో జీవిస్తున్నారని తెలిపారు. అందుకే ప్రజలంతా బీఆర్ఎస్కు జైకొడుతూ గులాబీ గూటికి చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, పార్టీ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, మర్ల చంద్రారెడ్డి, కొణతం సత్యనారాయణరెడ్డి, జీడి భిక్షం, ముద్దం కృష్ణారెడ్డి, కక్కిరేణి నాగయ్య, జూలకంటి జీవన్‌రెడ్డి, బొల్లె జానయ్య, బత్తుల ప్రసాద్, గుంషావలీ, కసగాని బ్రహ్మం పాల్గొన్నారు.