రామగిరి/ భువనగిరి అర్బన్/ సూర్యాపేట అర్బన్, సెప్టెంబర్ 19 : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి‘టీచర్ రిక్రుట్మెంట్ టెస్ట్'(టీఆర్టీ) నోటిఫికేషన్ను సర్కార్, విద్యాశాఖ విడుదల చేసిన విషయం విదితమే. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 503 వివిధ కేటగిరిలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబందించిన ఖాళీల వివరాలను సోమవారం కేటగిరి వారీగా విద్యాశాఖ విడుదల చేయడంతో ఆయా పోస్టులకు సిద్ధ్దమయ్యే అభ్యర్థుల్లో భరోసా పెరిగింది.
దీంతో ఎలా ప్రిపరేషన్ కావాలి అనే అంశంపై ప్రణాళికలు చేసుకుని చదవడం ప్రారంభించారు. బుధవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ఇప్పటికే టెట్ ఉత్తీర్ణలైన వారు సిద్దమవుతున్నారు.
రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ ప్రకారం నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇకా టీఆర్టి-2023తో మరో 503 టీచర్ పోస్టుల భర్తీకానున్నాయి. అయితే ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు ఉన్నాయానే అంశంపై విద్యాశాఖ స్పష్టత ఇస్తూ సోమవారం కేటగిరి వారీ ఖాళీలు విడుదల చేయడంతో బీఈడీ, డీఈడీ పూర్తి చేసి అభ్యర్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.