చందంపేట(దేవరకొండ), డిసెంబర్ 18: పంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచులుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. చందంపేట మండలం పోలేపల్లి సర్పంచ్‌గా గెలుపొందిన నోముల శ్రీను, మానావత్ తండా సర్పంచ్‌గా విజయం సాధించిన రమావత్ శ్రీకాంత్, కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల, కొత్తబావి, గౌరికుంట తండాల సర్పంచ్‌గా విజయం సాధించిన కావటి వెంకటేశ్, జబ్బు జంగమ్మ యాదవయ్య, రమావత్ దీప్లా నాయక్, దైర్యపురి తండా సర్పంచ్‌గా గెలుపొందిన రమావత్ అనితను ఆయన శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపా రు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.