భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 13 : జిల్లా కలెక్టర్‌గా జెండగే హనుమంతు కొండిబా నియమితులయ్యారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన బదిలీల్లో భాగంగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు, కలెక్టరేట్ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. 2016 బ్యాచ్‌కు చెందిన హనుమంతు కొండిబా ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తూ బదిలీపై వచ్చారు.