రామగిరి, జూన్ 25 : కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, దాన్ని నిరసిస్తూ జులై 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయ్రపదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సంఘం నల్లగొండ నియోజకవర్గ విస్తృత సమావేశం నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికులకు ప్రమాదకరంగా ఉన్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
2025-26 బడ్జెట్లో కేంద్రం కార్పొరేట్ విధానాలను అనుగుణంగా కేటాయింపులు చేసిందన్నారు. నూతనంగా సీఐటీయూ నల్లగొండ పట్టణ కన్వీనర్ గా అవుట రవీందర్, నల్లగొండ మండల కన్వీనర్‌గా పోలే సత్యనారాయణ, తిప్పర్తి మండల కన్వీనర్‌గా భీమగాని గణేశ్ తిరిగి ఎన్నికయ్యారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సలీం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యుడు కె.విజయలక్ష్మి, అద్దంకి నరసింహ, కోట్ల అశోక్‌రెడ్డి, సలివోజు సైదాచారి, గంజి నాగరాజు, పల్లె నగేశ్, మంత్రాల మంగమ్మ, కత్తుల యాదయ్య, జేరిపోతుల సైదులు, వెంకట్‌రెడ్డి, సాగర్ల మల్లయ్య, ఎ్రర సౌజన్య, పి.సరిత, మిరియాల శ్రీవాణి, పెరిక కృష్ణ, పేర్ల సంజీవ, పందుల లింగయ్య పాల్గొన్నారు.
Nalgonda : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి : తుమ్మల వీరారెడ్డి