అర్వపల్లి, జూలై 8 : జాజిరెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మం త్రి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామే ల్ వర్గాలు పరస్పరం కొట్టుకోవడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గ మండల కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యే సామేల్ ఏకపక్ష నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే మం డల అధ్యక్ష పదవులను కట్టబెట్టారన్న ఆరోపణతో మొదలైన సమస్య తీవ్ర ఘర్షణలకు దారి తీసింది.
బుధవారం ఎంపీ చామల, దామోదర్‌రెడ్డి, వర్గీయులు మండల అధ్యక్షుల ఎన్నిక రద్దు చేయాలని హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు వెళ్తుండగా అర్వపల్లిలో సామేలు అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తెలెత్తింది. అది కాస్త ముదరడంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకొని రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో రెండు వాహనాలు ధ్వంసమయ్యా యి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొడుతున్న క్రమంలో కొంతమంది కార్యకర్తలు, పోలీసుల చేతుల్లోని లాఠీలను గుంజుకొని దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు, మరికొంత మంది గాయపడ్డారు. ప్రత్యేక పోలీసు బలగాలు రావడంతో లాఠీ చార్జీచేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చా రు. ఏది ఏమైనప్పటికి ఎమ్మెల్యే సామేల్ వచ్చినప్పటి నుంచి పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.