ఆత్మకూరు (ఎం), ఏప్రిల్ 2 : మండలంలోని రాయపల్లి బికేరు వాగులోకి గోదావరి జలాల రాకతో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి బుధవారం బీఆర్ఎస్ నాయకులు, రైతులు క్షీరాభిషేకం, జలాభిషేకం చేసి, గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ సందర్భంగా రైతులు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ గోదావరి జలాల రాకతో గ్రామ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వానికి కండ్లు తెరిపించే విధంగా నేడు రాయిపల్లి వాగులోకి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల రావడంతో కాంగ్రెస్ నాయకులకు దికుతోచడంలేదన్నారు.
మండుటెండల్లో కూడా గోదావరి జలా లు రావడంతో వ్యవసాయ బావులు, బోర్లలో ఊటలు పెరిగాయని దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారని అన్నారు. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తానే గోదావరి జలాలను రప్పించానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై కాంగ్రెస్ నాయకులు తప్పు డు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పంజాల మల్లేశం, మండల, గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి ఇంద్రాల సంజీవ, మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు గాజుల సిద్ధిరాములు, బెజ్జరబోయిన సత్యనారాయణ, పరకాల రాములు, యూత్ అధ్యక్షుడు పరకాల నాగరాజు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు గజరాజు అనిల్, వార్డు సభ్యురాలు ఇంద్రాల అనసూయ నర్సయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిల్లాల మల్లారెడ్డి, వడ్డెబోయిన నాగ మైసయ్య, కుమ్మరి కుం ట్ల మధు, మాజీ సర్పంచ్ సుమతీ శ్రీనివాస్, కూరెళ్ల చంద్రయ్య, మల్యాల వెంకటయ్యచారి, మల్యాల శ్రీనివాస్‌చారి, కూరెళ్ల అంజనేయులు, ఇంద్రాల ఎల్లయ్య, జెట్ట సిద్ధులు, దేవనబోయిన మధు, ఇంద్రాల గణేష్, కుమ్మరికుంట్ల పరశురాములు తదితరులు పాల్గొన్నారు.