దేవరకొండ రూరల్, జనవరి 5 : పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమక్షంలో పీఏపల్లి మండలం అజ్మాపుర్ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ నగేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ రామకృష్ణాచారి, వార్డు సభ్యులు రమాదేవీశ్రీనివాస్తో పాటు గ్రామానికి చెందిన మరో 40మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో 1.60లక్షల ఎకరాలకు సాగు నీరందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.
రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏర్పడ్డాకే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. పార్టీలో చేరిన వారిలో సీత శ్రీరాములు, ఇడబోయిన వెంకటేశ్, పెరిక విజయ్‌కుమార్, జటావాత్ శ్రీనివాస్, కంబాలపల్లి గోవర్దన్, శ్రీధర్, మహేశ్, అశోక్, కొండల్ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, నాయకులు అర్వపల్లి నర్సింహ, గుండాల శ్రీనివాస్, ఎర్ర యాదగిరి, గోవర్ధన్, కడారి శ్రీనివాస్, నరేందర్, కర్ణయ్య, నిరంజన్, గోవింద్, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.