తుంగతుర్తి, మే 08 : చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈఈ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం తుంగతుర్తి మండలంలోని దేవునిగుట్ట తండాలో నిర్వహించిన ‘రైతు వారం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, కాల్వల నిర్వహణపై రైతులు శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మన్ గుడిపాటి సైదులు, దేవునిగుట్ట తండా సర్పంచ్ గూగులోత్ స్వాతి, వెంపటి సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య, చింతకుంట్ల వెంకన్న, పలువురు అధికారులు, రైతులు పాల్గొన్నారు.