సూర్యాపేట రూరల్, జనవరి 22 : తెలంగాణ పల్లెల్లో కనపడుతున్న అభివృద్ధి 25 ఏండ్లుగా పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కాసరబాద, కేసారంలో రూ.2కోట్లతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయం, ఓపెన్ జిమ్, పంచాయతీ కార్యాలయం, పల్లె దవాఖాన, అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా కేసారంలో రూ. 25లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశార. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎవరి పాలనలో మనకు లాభం జరిగిందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రేస్, బీజేపీ పార్టీలు ప్రజలకు ఏం చేశారో..? ఏం చేస్తారో..? చెప్పే దమ్ము, దైర్యం ఉందా అని ప్రశ్నించారు.
ఆ పార్టీల జెండాలు పట్టుకొని తిరుగుతున్న నాయకులను ప్రజలే ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని, మోస పోతే దగా పడుతామని తెలిపారు. గుర్తుంచుకోవాలన్నారు. పింఛన్లు, సంక్షేమ పథకాల కోసం ఒక్కో గ్రామానికి ప్రభుత్వం సంవత్సరానికి రూ.5కోట్లకు పైనే నిధులు వస్తున్నాయన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, జడ్పి వైస్‌చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు కొల్లు రేణుకానరేశ్, మెంతబోయన నాగయ్య, ఎంపీటీసీలు బంటు నాగమ్మసైదులు, వాంకుడోతు బాలాజీ, బీఆర్ఎస్ నాయకులు సంకరమద్ది రమణారెడ్డి, గొర్ల గన్నారెడ్డి, ముదిరెడ్డి సంతోశ్‌రెడ్డి పాల్గొన్నారు.