కట్టంగూర్, మార్చి 25 : కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని సీపీఎం పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కట్టంగూర్ తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలు ఇస్తామని చెప్పి అనేక కొర్రీలు పెట్టి ఇవ్వడం లేదన్నారు. గ్రామాల్లో భూములు లేక ఉపాధి కరువై పట్టణాలకు వలస వెళ్లి అడ్డా కూలీలుగా ఉపాధి పొందుతున్న పేదలకు ఉపాధి హామీ చట్టాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కొత్త పింఛన్లు మంజూరు చేయాలన్నారు. అనంతరం తాసీల్దార్ గుగులోతు ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళీధర్, మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, నాయకులు గడగోతజు రవీంద్రాచారి, కట్ట బక్కయ్య, జాల రమేశ్, ఊట్కూరు యాదయ్య, ఊట్కూరు సుజాత, శీను, జాల రమేశ్, నంద్యాల రాంరెడ్డి, చిలుముల కృష్ణ, పెంజర్ల కృష్ణ పాల్గొన్నారు.