యాదాద్రి భువనగిరి, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ఆపత్కాలంలో ఉన్న కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ సర్కార్ మొండిచెయ్యి చూపిస్తోంది. ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద మృతి చెంది ఆ కుటుంబం రోడ్డున పడితే ఆదుకోకుండా గాలికొదిలేసింది. గీతన్నల కోసం ఉన్న ఒకటీ రెండు పథకాలను అటకెక్కించింది. గీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ప్రమాద బీమా పథకం పత్తాలేకుండా పోయింది. రూ. 5 లక్షల బీమా పథకం అటకెక్కింది. దీంతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
గీత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కల్లు గీస్తూ దురదృష్టకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టారు. రైతు బీమా తరహాలోనే 2023లో గీత కార్మికులకు బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవారు. శాశ్వతంగా దివ్యాంగులైతే రూ. 5లక్షల సాయం అందేది. గతంలో గీతన్నలకు ఎక్స్గ్రేషియా కేవలం రూ. 2లక్షలు మాత్రమే ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని రూ. 5లక్షల పెంచి.. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది.
98 మందికి పెండింగ్..
యాదాద్రి భువనగిరి జిల్లాలో 14262 మంది గీత కార్మికులు, 350 వరకు సంఘాలు, సొసైటీలు ఉన్నా యి. జిల్లాలో ఇప్పటి వరకు 103 మంది వివిధ కేటగిరీల్లో దరఖాస్తు చేసుకోగా 98 మందికి బీమా మం జూరైంది. ఇందులో 15 మంది ప్రమాదవశాత్తు చనిపోగా, 54 మందికి శాశ్వత అంగవైకల్యానికి గురయ్యా రు. అయితే కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చినప్పటి నుంచి బీమా పరిహారాన్ని విస్మరించింది. జిల్లాలో సుమారు రూ. 2.80 కోట్ల సాయం పెండింగ్లో ఉంది.
గతేడాది జూ లై 14న లష్కర్గూడ బహిరంగ స భలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. వారం రోజుల్లోనే డబ్బులు క్లియర్ చేస్తామని ప్రకటించారు. ప్రకటన చేసి ఈ నెల 14వ తేదీ నాటికి ఏడాది పూర్తయినా ప్రభుత్వం పట్టించుకోలేదంటే గీత కార్మికుల సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. మరో వైపు లబ్ధిదారులు మాత్రం సర్కార్ తమపై ఎప్పు డు దయ తలుస్తుందోననే ఆశతో ఎదురుచూస్తున్నారు.
10 లక్షల హామీ ఏమాయే..?
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గీత కార్మికులకు రూ. 10లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని వాగ్ధానం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు ఉలుకూపలుకూ లేదు. ఆ దిశగా కనీసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతే కాకుండా గీత కార్మికుల పింఛన్ల పెంపు, కాటమయ్య సేఫ్టీ మోకులు ఏవీ ముందుకు పడలేదు.
గీత కార్పొరేషన్ సాయమూ బంద్
కల్లుగీత కార్మికులకు ప్రమాద బీమాతోపాటు చనిపోతే తక్షణ సాయంగా కల్లుగీత కార్పొరేషన్ నుంచి సాయం అందేది. కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.25లక్షలు, వికలాంగుడైతే రూ.15వేల ఎక్స్గ్రేషియా చెల్లించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎక్స్గ్రేషియాను తుంగలో తొక్కింది. ఇప్పటివరకు ఒక్కరికీ సాయం అందలేదని గీత కార్మిక సంఘాల నేతలే చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఠంచనుగా అందేవని గుర్తు చేస్తు న్నారు.
ప్రమాద బీమా చెల్లించాలి..
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాటలతో గీత కార్మికులను మోసం చేసింది. అధికారంలోకి వచ్చాక కన్నెత్తి కూడా చూడటంలేదు. కొత్త పథకాలు దేవుడెరుగు.. ఉన్న వా టిని కూడా సక్రమంగా అమలు చేయడంలేదు. ప్ర మాద బీమా డబ్బులు అందక గీత కార్మిక కుటుంబా లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వెంటనే బీమా డబ్బులు చెల్లించాలి. ఎన్నికల హామీ అయిన రూ. 10 లక్షల బీమా ఊసేలేదు. గీత కార్పొరేషన్ నుంచి ఇచ్చే సాయాన్ని నిలిపేసింది. కాటమయ్య సేఫ్టీ మోకులు పంపిణీ చేయడంలేదు. పింఛన్ల పెంపు పత్తాలేదు.
– బొలగాని జయరాములు, కల్లుగీత కార్మిక సంఘం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు