కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కీలకమైన సంక్షేమ శాఖలను గాలికొదిలేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలను నిర్వీ ర్యం చేస్తున్నది. అసలు ఆ యా శాఖలకు రెగ్యులర్ బాస్‌లను నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నా లుగు విభాగాల్లోనూ ఇన్చార్జీ అధికారులతో తూతూమంత్రంగా నెట్టుకొస్తున్నది. ఫలితంగా జిల్లాలో సంక్షేమ పాల న కుంటుపడుతున్నది. అధికారుల పర్యవేక్షణలోపం తో పథకాల అమలులో పారదర్శకత లోపిస్తున్నది. పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేస్తున్నాయి. ఇన్చార్జీ అధికారులు తమ శాఖలు, మండలాలకు స్పెషల్ ఆఫీసర్లుగా కొనసాగుతుండటం కొసమెరుపు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలో జనాభాలో అధిక శాతం ఉన్న బీసీ శాఖకు పూర్తి స్థాయి అధికారి లేరు. ఈ శాఖకు అధికారిగా ఉన్న యాదయ్య రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. తర్వాత ఎవరూ రెగ్యులర్ ఆఫీసర్‌ను నియమించలేదు. జిల్లా కార్మిక శాఖ అధికారి సాహితీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ శాఖ పరిధిలో అనేక సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. రెగ్యులర్ అధికారి ఉంటేనే పనులు ముందుకు సాగడం అంత సులువు కాదు. ఇప్పుడు రెండు, మూడు విభాగాల బాధ్యతలను చూస్తున్న అధికారి పని చేయడం అంటే కత్తిమీద సాము అనే చెప్పాలి.
గిరిజన సంక్షేమ శాఖలోనూ..
జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖను పట్టించుకోవడమే మానేశారు. మూడేండ్లు దాటినా ఆ శాఖకు పూర్తి స్థాయి అధికారి లేరు. గతంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా ఉన్న మంగ్తానాయక్ ఏసీబీకి పట్టుబడ్డారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంటూ వస్తున్నది. డీఆర్డీవోకు ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించారు. డీఆర్డీవోగా పని చేసిన ఉపేందర్‌రెడ్డి, నాగిరెడ్డి, కృష్ణన్ వరుసగా ఇన్‌చార్జీగా పనిచేశారు. ప్రస్తుత డీఆర్డీవో నాగిరెడ్డి ఇన్చారీర్జ్గా వ్యవహరిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖకు రెగ్యులర్ అధికారిని అపాయింట్ చేయడం లేదు.
మైనార్టీ శాఖలో రెండేండ్లకు పైగా..
జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నదా లేదా అన్నట్లు ఉన్నది. ఆ శాఖ సంక్షేమ అధికారి పో స్టు మూడేండ్లుగా ఉత్తగనే ఉంది. గతంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా సత్యనారాయణ ఉండేది. ఆయన వెళ్లిపోయాక ఆ శాఖను అప్పటి బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఉన్న యాదయ్యకు ఇన్ఛార్జీ బాధ్యతలు ఇచ్చారు. జిల్లా కార్మిక శాఖ అధికారి సాహితీకి ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించారు. ఈ శాఖలో వక్ఫ్ ఇన్స్పెక్టర్ పోస్ట్‌ను కూడా భర్తీ చేయలేదు.
ఎక్కడి సమస్యలు అక్కడే..
ఇన్చార్జీ బాస్‌లతో సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రభావం పడుతున్నది. ఆయా శాఖల పరిధిలో హాస్టళ్లు, ఇతర సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఆయా శాఖల్లో శాఖలో స్కాలర్‌షిప్‌లతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, అంబేద్కర్, మహాత్మాజ్యోతిరావు ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం, రాజీవ్ యువ వికాసం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఇన్సెంటివ్స్, కల్యాణ లక్ష్మి తదితర పథకాలు అమలవుతున్నాయి. పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో పథకాలు, కార్యక్రమాలు అంతంత మాత్రంగానే అమలవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఆయా శాఖల ఫైళ్లు ముందుకు కదలడం లేదు. ఏదైనా నిర్ణయాలు తీసుకునే సమయంలో తమకెందుకు అని వెనకాడుతున్నారు. ఫలితంగా జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎస్సీ సంక్షేమ శాఖకు ఇన్చార్జే..
జిల్లాలో ఎస్సీ సంక్షేమ శాఖలోనూ ఇన్చార్జీ అధికారితోనే కాలం వెల్లదీస్తున్నారు. గతంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిగా ఉన్న జయపాల్ రెడ్డి హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో హాస్టళ్ల అధికారి వసంత కుమారికి ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించారు. ఆమె కూడా ఇటీవల రిటైర్ కావడంతో పదవి ఖాళీ అయ్యింది. దీంతో చేసేదేంలేక జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.శ్యాంసుందర్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. శ్యాంసుందర్ సైతం భువనగిరి మండలానికి స్పెషల్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు.