చండూరు, మే 03 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ అన్నారు. శనివారం చండూరు మండలం పుల్లెంల గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి మాట్లాడారు. పని ప్రదేశాల్లో కనీస అవసరాలు అయినా మంచినీరు, మెడికల్ కిట్, పార, గడ్డపార ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించి రోజువారి వేతనం రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు చెల్లించాలన్నారు.
వ్యవసాయ కూలీలకు ఇల్లు స్థలాలు ఇచ్చి,ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. అర్హులందరికి రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ. జానిమియా, చెడుబుద్ధి ఊషయ్య, చండూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాతరాజు సైదులు, ఇరిగి సంజీవ, ఉపాధి హామీ కూలీలు గండు సత్తయ్య, దుబ్బాక వెంకన్న, పాక లింగయ్య, మోగదాల భిక్షపతి, కనకమ్మ, అంజమ్మ, పద్మ, లక్ష్మమ్మ పాల్గొన్నారు.