నీలగిరి, ఏప్రిల్ 02 : తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ పట్టణానికి చెందిన తలారి యాదయ్యను నియమిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేయగా నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ కారులకు న్యాయం జరిగే వరకు ఉద్యమించాలని కోరారు. ఈ ఎన్నికకు కృషి చేసిన రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు, ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్‌కు తలారి యాదయ్య ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీయూఎఫ్ నాయకులు వల్కి వెంకటేశం, పీయు జేఏసీ నాయకులు వై.రాంబాబు యాదవ్, గంజి రాజేందర్, లెక్చరర్లు, డీ.మహేందర్, సుధాకర్, పెండెం ధనుంజయ, గంజి వెంకన్న, సీనియర్ ఉద్యమకారులు రేఖలు భిక్షం పాల్గొన్నారు.