బీబీనగర్, నవంబర్ 9 : మండలంలోని కొండమడుగు గ్రామానికి చెందిన కొత్తపల్లి రామారావు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. మిత్రుడి అకాల మరణం మిత్రబృందాన్ని తీవ్ర దుఃఖంలో ముంచింది. ఆ మిత్రుడి కుటుంబానికి మనోధైర్యం, ఆర్థికంగా తోడ్పాటు అందించాలన్న సంకల్పంతో ఎస్సెస్సీ బ్యాచ్ 2002 క్లాస్మేట్స్ ముందుకొచ్చారు. ఈ సందర్భంగా మిత్రులు అందరూ కలసి రూ.52,000 ఆర్థిక సహాయాన్ని రామారావు కుటుంబ సభ్యులకు అందజేశారు. రామారావు స్మృతిని తలచుకుంటూ మిత్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో మిత్రులు కడెం సాయిప్రసాద్, కనకబోయిన చిరంజీవి, దూడల మధు, మంద శ్రీశైలం, భాషబోయిన కొండల్, కూతడి భాస్కర్, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.