బొడ్రాయిబజార్, జూన్ 14 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రెండ్రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ఇంటర్ సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల క్రీడలు శుక్రవారం ముగిశాయి. కబడ్డీలో మొదటి బహుమతి నల్లగొండ ఆపరేషన్ సర్కిల్, ద్వితీయ బహుమతి మహబూబ్నగర్ ఆపరేషన్ సర్కిల్, తృతీయ బహుమతి వరంగల్ సర్కిల్ గెలుచుకున్నాయి.
క్రీడల్లో గెలుపొందిన విజేతలకు అధికారులు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఎస్ఈ సీహెచ్ పాల్రాజ్, ఆపరేషన్ డీఈలు శ్రీనివాస్, వెంకటకృష్ణయ్య, డీఈ టెక్నికల్ దాలినాయుడు, నల్లగొండ జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ శ్రీనివాస్, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 ప్రాంతీయ అధ్యక్షుడు నేతకాని వెంకన్న, టీఆర్వీకే మల్లికార్జున్, 327 దశరథ రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.