‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
వర్షాకాలంలో రైతులు సాగు చేసిన వరి, పత్తి పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట నష్టాలను పరిశీలించి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం..
– సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
నాంపల్లి, నవంబర్ 02 : వర్షాకాలంలో రైతులు సాగు చేసిన వరి, పత్తి పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట నష్టాలను పరిశీలించి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన కరువు యాత్రలో భాగంగా నాంపల్లి మండలం నరసింహులగూడెం గ్రామంలో ఎండిన వరి, పత్తి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, పత్తి, ఇతర పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. రైతులకు ఉపాధి హామీ పనిదినాలు పెంచి, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను కరువు రాష్ట్రంగా గుర్తించి రూ.30 వేల కోట్ల నిధులు కేటాయించాలన్నారు. రైతులకు కొత్త రుణాలు అందించి అపరాధ వడ్డీల భారం తగ్గించాలని, కౌలు రైతులను కూడా ఆదుకోవాలని కోరారు. దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించాలని, గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్. అంజయ్య చారి, తిరుపారి వెంకటేష్, మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ గిరి రమ, మండల కార్యదర్శి సుదనబోయిన రమేష్, సహాయ కార్యదర్శి నేతాళ్ల రాజు, మండల కార్యవర్గ సభ్యులు కోరే సత్తయ్య, ఊరుపాక వెంకటయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

