రామగిరి, డిసెంబర్ 09 : సబ్బండ వర్గాల పోరాటం, వేలాది మంది విద్యార్థుల త్యాగం, ముఖ్యంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పాలకవర్గం కదిలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించిన రోజుకు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్వీ నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ వర్సిటీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక్క పిలుపుతో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి శక్తి ఉద్యమాన్ని ఉర్రూతలూగించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే ప్రధాన బల, ప్రజాస్వామ్య పోరాటానికి మూలస్తంభం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు గాదే శివకుమార్, దినేశ్, అశోక్, నందిని, పల్లవి, అక్షిత పాల్గొన్నారు.