ప్రపంచానికే తెలంగాణ రోల్‌మోడల్
కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ 14 ఏండ్లు పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచానికి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
- ఆవిర్భావ వేడుకల్లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
సూర్యాపేట, జూన్ 2: కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ 14 ఏండ్లు పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచానికి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి జాతీయ జెండా, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సూర్యాపేట దశ, దిశ మార్చారన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని, రాష్ట్ర ప్రజల సతమతమవుతున్నారని, మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనే తెలంగాణాకు శ్రీరామరక్ష అని ప్రజలకు తెలిసిపోయిందని, కాం గ్రెస్ పాలనకు చరమగీతం పాడేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, పెన్‌పహాడ్, ఆత్మకూర్.ఎస్ మండలాల అధ్యక్షులు దొంగరి యుగందర్, తూడి నర్సింహారావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, అంగిరేకుల నాగార్జునతో పాటు కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

