రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యాలయాల్లో జాతీయ జెండాలు, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు. వారు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ కృషిని మరోసారి నెమరువేసుకున్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని..దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపారని పలువురు వక్తలు పేర్కొన్నారు.
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను విస్మరించిందని విమర్శించారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్, సూర్యాపేట జిల్లా పార్టీ ఆఫీసులో పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్యయాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాతో పాటు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
బీబీనగర్, జూన్ 2 : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురసరించుకుని భువనగిరి పట్టణ కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బీబీనగర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్‌గౌడ్, రైతుబంధు సమితి మండల మాజీ అధ్యక్షుడు బొక జయపాల్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గాదె నరేందర్‌రెడ్డి, ఆకుల ప్రభాకర్, గుంటిపల్లి లక్ష్మీనారాయణ, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పిట్టల అశోక్, మాజీ ఎంపీటీసీ గోరుకంటి బాలచందర్, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు మంచాల రవికుమార్, పంజాల సతీశ్ గౌడ్, జకి నగేశ్, పచ్చిమట్ల వంశీ తదితరులు పాల్గొన్నారు.