కోదాడ, జనవరి 30 : తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న బార్ కౌన్సిల్ సభ్యుల ఎంపికకు నిర్వహిస్తున్న ఎన్నికలు శుక్రవారం కోదాడ కోర్టు ఆవరణలో 69 బూత్ లో జరిగాయి. ఈ మేరకు కోదాడ బార్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 మందిని ఎన్నుకోవాల్సి ఉండగా 203 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కోదాడ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో స్థానిక న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ అధికారులుగా చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, రామిశెట్టి రామకృష్ణ, సీనియర్ న్యాయవాది సాధు శరత్ బాబు, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు బాధ్యతలు నిర్వహించారు. కాగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను తొలి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎండి ఉమర్, సూపరింటెండెంట్ మోసిన్ అలీ పరిశీలించారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల నరసయ్య, సీనియర్ న్యాయవాదులు ఎస్ ఆర్ కె మూర్తి, సుధాకర్ రెడ్డి, వెంకట్రావు, దేవబత్తిని నాగార్జున, యశ్వంత్, రంగారావుతో పాటు ఇతర న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.