టీచర్ల ధ్రువపత్రాల పరిశీలన
భువనగిరి పట్టణంలోని బీచ్మహాళ్ల ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ఆదివారం ముగిసింది. డీఈఓ కె.నారాయణరెడ్డి సర్టిఫికెట్లను పరిశీలించారు
- జిల్లాలో పదోన్నతులకు 250 ఖాళీలు
- సుమారు 700 మంది ఉపాధ్యాయుల హాజరు
- దరఖాస్తులకు నేడు చివరి గడువు
భువనగిరి అర్బన్, జనవరి 29 : భువనగిరి పట్టణంలోని బీచ్మహాళ్ల ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ఆదివారం ముగిసింది. డీఈఓ కె.నారాయణరెడ్డి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరిశీలన సాయంత్రం వరకు కొనసాగింది. గణితం, ఫిజిక్స్, జీవశాస్త్రం, సాంఘీకశాస్త్రం, ఇంగ్లిష్ విభాగాల్లో పదోన్నతి పొందేందుకు 250 మందికి అవకాశం ఉండగా, సర్టిఫికెట్ల పరిశీలనకు సుమారు 650 నుంచి 700 మంది ఉపాధ్యాయులు హాజరైనట్లు డీఈఓ తెలిపారు. కాగా, టీచర్ల బదిలీలకు సంబంధించి జిల్లాలో మొత్తం 1,374 ఖాళీలు ఉన్నాయి.
నేటితో ముగియనున్న గడువు
జిల్లాలో ప్రారంభమైన టీచర్ల బదిలీల దరఖాస్తులు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. మొదటి రోజు అంతంత మాత్రమే దరఖాస్తు చేసుకోగా, రెండో రోజు భారీగా వచ్చాయి. దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుండడంతో మరింత హడావిడి ఉండే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రిపరెన్షియల్ కేటగిరీ(వ్యాధులు కల్గినవారు) టీచర్లు వారి వ్యాధులకు సంబంధించిన పరిశీలన కోసం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు నుంచి సంబంధిత పత్రాలను దరఖాస్తుతోపాటు సమర్పించుకున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

