– ఎంపిన అభ్యర్ధులకు ఉత్తర్వులు అందచేసిన వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
రామగిరి, మే 11 : విద్యా వారోత్సవాల్లో భాగంగా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన టీచర్ రిక్యూట్మెంట్ జాబ్ మేళా విజయవతంగా ముగిసింది. కాగా ప్రముఖ టీచింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ ‘ఇన్నోక్యూటర్’ తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ పాంప్లాయిమెంట్ థీమ్ అండ్ అదిశిక్ష, ఎంజీయూ డైరెక్టరేట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేళాకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 130 మంది యూజీ, పీజీ, బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి రాత పరీక్షలు, ఇంటర్యూలు నిర్వహించి 30 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు ఎంజీయూ ట్రైనింగ్ అండ్ ప్లెస్మెంట్ సెల్ డైరెక్టర్ డా.హరీష్ కుమార్ తెలిపారు.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సాయంత్రం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నియమక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలకే ఇలాంటి జాబ్‌మేళాలు నిర్వహణ చేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి, ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.